మేడికొండూరు: రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

407చూసినవారు
మేడికొండూరు: రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి
శుక్రవారం తెల్లవారుజామున మేడికొండూరు మండలం జంగగుంట్లపాలెం వద్ద రెండు భారీ లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో సత్తెనపల్లి వైపు వస్తున్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే మేడికొండూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్