హోంగార్డు సుభాని సేవలకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్కారం

810చూసినవారు
హోంగార్డు సుభాని సేవలకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్కారం
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం బొల్లవరం అడ్డరోడ్డులో 26 ఏళ్లుగా ఎండకాలంలో బాటసారులకు మంచినీరు అందిస్తున్న హోంగార్డు సుభాని సేవలను శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గుర్తించి సత్కరించారు. బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. శాంతిభద్రతల విధులు నిర్వహిస్తూనే సొంత ఖర్చుతో వేలాది మందికి నీరు అందించడం ఆయన పట్టుదలకు చిహ్నమని, ఈ నిస్వార్థ సేవ యువతకు స్ఫూర్తి అని ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్