నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామం సమీపంలో ఆదివారం ఉదయం సున్నపుబట్టి వద్ద కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.