నూజెండ్ల: గురుకుల పాఠశాలలో మజ్జిగలో మూతి పెట్టిన కుక్క

597చూసినవారు
నూజెండ్ల: గురుకుల పాఠశాలలో మజ్జిగలో మూతి పెట్టిన కుక్క
నూజెండ్ల మండలం ఉప్పలపాడులోని డా. బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాల వసతి గృహంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం భోజనశాలలో ఉన్న మజ్జిగ కుండల్లోకి కుక్కలు నోరుపెట్టి తాగేశాయని విద్యార్థినుల తల్లిదండ్రులు సిబ్బందిని ప్రశ్నించారు. కుక్కలు తాగిన మజ్జిగను పిల్లలకు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ  సమయంలో ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంపై కూడా వారు అసంతృప్తి తెలిపారు.

సంబంధిత పోస్ట్