పల్నాడు: లోన్ వివాదంలో దాడి.. పోలీసులు దృష్టి పెట్టని ఆరోపణ

1247చూసినవారు
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నందిగామ గ్రామానికి చెందిన శ్రీదేవి, చంద్రగిరి శ్రీరాములతో లావాదేవీల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. డబ్బు మొత్తం చెల్లించినా, ప్రామిసరీ నోటును చూపిస్తూ శ్రీరాములు రోజూ తాగి వచ్చి గొడవ చేస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. తల్లిదండ్రులపై దాడి చేశారని, ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆమె తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, గ్రీవెన్స్ ఇచ్చినా చర్యలు తీసుకోలేదని, కుటుంబం నష్టపోయిందని, ప్రాణహాని ఉందని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్