రాజధానిలో నిర్వహించే 'మన నీరు-మన భద్రత' సదస్సుకు సత్తెనపల్లి డివిజన్ పరిధిలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతులు గురువారం తరలివెళ్లారు. రాయపూడి వద్ద డీసీ ఛైర్మన్ గుంటూరు రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలను కూటమి నేతలు జెండా ఊపి ప్రారంభించారు. నీటి సంరక్షణ, భవిష్యత్ ప్రణాళికలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సాగునీటి నిర్వహణలో సంఘాల పాత్రను బలోపేతం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.