రోడ్డు ప్రమాద బాధితుడు చికిత్స పొందుతూ మృతి..

5371చూసినవారు
సత్తెనపల్లి మండలం నందిగామ సమీపంలో శనివారం జరిగిన కారు-ఆటో ఢీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెదకూరపాడుకు చెందిన ఆదం షఫీ (55) ఆదివారం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రభుత్వ చేతిపంపుల మరమ్మతుల కార్మికుడిగా పనిచేస్తున్న షఫీ, విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భర్త మృతదేహాన్ని చూసి భార్య, ముగ్గురు కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపించడంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్