సత్తెనపల్లి మెయిన్ రోడ్డులో ఎత్తుపల్లాలు, సరైన మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరిగిపోయాయి. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, బుధవారం సిపిఐ సత్తెనపల్లి సమితి ఆధ్వర్యంలో ప్రమాద స్థలంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.