సత్తెనపల్లి పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్ కైఫ్ ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ సీటు సాధించి ఘనత సాధించాడు. గేట్ పరీక్షలో జాతీయస్థాయిలో 393వ ర్యాంకు సాధించిన కైఫ్‌కు ఈ అవకాశం లభించింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో 9. 27 సీజీపీఏతో ప్రతిభ కనబరిచాడు. పదో తరగతిలో కూడా 600కి 592 మార్కులు సాధించి ఉత్తమ
ఫలితాలు సాధించాడు. ఈ విజయంపై తల్లిదండ్రులు, బంధువులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కైఫ్‌ను అభినందించారు.