తుళ్లూరులో పచారీ దుకాణంలో చోరీ.. తాళాలు పగులగొట్టి నగదు అపహరణ

3694చూసినవారు
తుళ్లూరు సాయిబాబా ఆలయం సమీపంలోని పచారీ దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుకాణ యజమాని షాపు తెరవడానికి వెళ్ళగా తాళాలు పగులగొట్టి ఉన్నాయని గుర్తించారు. లోపల సీసీ కెమెరాల డీవీఆర్, సిగరెట్ దిండ్లు, సుమారు రూ. 20 వేల విలువైన కాయిన్స్ దొంగిలించబడ్డాయి. శనివారం అర్ధరాత్రి సమయంలోనే ఈ చోరీ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్