ద్విచక్ర వాహనం బొలెరో ఢీ..ఒకరు మృతి

3చూసినవారు
ద్విచక్ర వాహనం బొలెరో ఢీ..ఒకరు మృతి
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగురాళ్లలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న జాలాది సుమన్కుమార్ (42) తన సహోద్యోగితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సుమన్కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, అతని సహోద్యోగికి గాయాలయ్యాయి. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్