కారు బైక్ ఢీ సత్తెనపల్లికి చెందిన ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

1879చూసినవారు
కారు బైక్ ఢీ సత్తెనపల్లికి చెందిన ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నపాడు కాలువ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు నాగార్జున కాలనీ, సత్తెనపల్లి టౌన్‌కు చెందిన వేజెండ్ల విగ్నేష్ (24), వడ్లవల్లి సెంటర్‌కు చెందిన గంప రాజు (26)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్