క్రోసూరు పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి పడి ఒక మహిళ మృతి చెందింది. కుటుంబ కలహాల విచారణకు వచ్చిన ఆమె, స్టేషన్ మొదటి అంతస్తు నుంచి జారిపడి మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బంధువుల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.