
అమరావతి: పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే
అమరావతిలో శుక్రవారం జరిగిన క్లస్టర్ ఇంచార్జీలు, బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం బూత్ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేర్చాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

































