
తుళ్లూరు: రాజధానిలో మొట్టమొదటి ఫోర్ స్టార్ హోటల్‌కు భూమిపూజ
తుళ్లూరు మండలం లింగాయపాలెం లో సీఆర్డీఏ ఆఫీస్ పక్కన మంజీరా హోటల్స్ ఆధ్వర్యంలో 'హాలిడే ఇన్' ఫోర్ స్టార్ హోటల్ కు గురువారం భూమిపూజ జరిగింది. మంజీరా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యోగానంద్ మాట్లాడుతూ, ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, రూ. 275 కోట్లతో 250 రూమ్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు చేసిన హైటెక్ సిటీ, హైదరాబాద్ డెవలప్మెంట్ను చూసి ఆయనను నమ్మి వచ్చామని ఆయన పేర్కొన్నారు.


































