'సంతానం భారమే కాదు.. సంపద'.. సీఎం చంద్రబాబు

2321చూసినవారు
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఉండవల్లిలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ, గతంలో తాతయ్యలు, అమ్మమ్మలు పిల్లల పెంపకంలో కీలక పాత్ర పోషించి, కుటుంబ విలువలు నేర్పేవారని గుర్తుచేశారు. సంతానాన్ని భారంగా కాకుండా కుటుంబ సంపదగా చూడాలని సూచించిన ఆయన, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్