అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిసి ప్రభుత్వ నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలిపారు. 2004 సెప్టెంబర్‌కు ముందు నియమితులైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు, గురుకులాలు, కార్పొరేషన్ల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచిన నిర్ణయాన్ని వారు స్వాగతించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.