మేరీకపూడిలో రైతులకు సమగ్ర సస్యరక్షణపై అవగాహన

679చూసినవారు
మేరీకపూడిలో రైతులకు సమగ్ర సస్యరక్షణపై అవగాహన
ఫిరంగిపురం మండలంలోని మేరీకపూడి గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి జే. వాసంతి 30 మంది రైతులకు శనగ పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు, తెగుళ్లు, పురుగుల నివారణపై అవగాహన కల్పించారు. రేపూడి గ్రామంలో మట్టి నమూనాలు సేకరించే విధానం, ఆన్లైన్ ప్రక్రియను వివరించారు. మట్టి పరీక్షల ద్వారా ఎరువుల వినియోగాన్ని సమర్థవంతంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్