తుళ్లూరులో వైభవంగా హనుమాన్ చాలీసా కార్యక్రమం

473చూసినవారు
తుళ్లూరులో వైభవంగా హనుమాన్ చాలీసా కార్యక్రమం
తాడికొండ నియోజకవర్గం తుళ్లూరులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా 108 పర్యాయములు హనుమాన్ చాలీసా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఈ వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అర్చకులు దిట్టకవి రాజగోపాలచార్యులు తెలిపారు. ఉదయం ఆంజనేయ స్వామికి అభిషేకాలు, తమలపాకులతో పూజ అనంతరం చాలీసా పారాయణం జరిగింది. కార్యక్రమం తర్వాత అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్