తుళ్లూరులోని శ్రీ కోదండరామ స్వామి వారి శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా, ఆలయ అర్చక స్వామి దిట్టకవి రాజగోపాలచార్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు శ్రీ కోదండరామ స్వామి వారికి నిత్య హోమము, నిత్య బలిహరణ, సాయంత్రం కుంభము, గజ వాహన హోమము నిర్వహించి గజవాహన గ్రామోత్సవం జరగనుంది. రేపు సాయంత్రం ఏడు గంటల నుంచి అశ్వవాహన సేవ నిర్వహిస్తామని తెలిపారు.