మేడికొండూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో పల్స్ పోలియో డ్రైవ్ ముమ్మరం

2296చూసినవారు
మేడికొండూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో పల్స్ పోలియో డ్రైవ్ ముమ్మరం
మేడికొండూరు పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సిద్దిక్ ఆధ్వర్యంలో గుంటూరు - సత్తెనపల్లి రోడ్డులోని పేరేచర్ల పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విస్తృతంగా జరిగింది. ప్రయాణాల్లో ఉన్న చిన్నారులు, బస్టాండ్లు, రోడ్లపై వెళ్లే వారికి ఆటోల ద్వారా తిరుగుతూ మొబైల్ టీమ్ సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకూడదనే లక్ష్యంతో వైద్యాధికారి డాక్టర్ సిద్దిక్ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్