మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన 43 ఏళ్ల దివ్యాంగుడు సునీల్‌కుమార్ మృతిచెందాడు. తన తల్లి విజయలలితతో కలిసి మూడు చక్రాల వాహనంపై సత్తెనపల్లి వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సునీల్‌కుమార్ అక్కడికక్కడే మరణించగా, అతని తల్లి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.