తాడికొండ: అమరావతి రైతులకు సన్మానం 5న

721చూసినవారు
తాడికొండ: అమరావతి రైతులకు సన్మానం 5న
అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, ఆమె తండ్రి మనోజ్ ఈ నెల 5న రాజధాని గ్రామం అనంతవరం రానున్నారు. గ్రామంలోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులను సన్మానించనున్నారని అమరావతి ఐకాస నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వైష్ణవి, మనోజ్లను రాజధాని రైతులు ఘనంగా సన్మానించనున్నారు. కార్యక్రమంలో రాజధాని రైతులు, మహిళలు ఆకుపచ్చ కండువాలు ధరించి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఐకాస నాయకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్