తాడికొండ: ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన డైమండ్ బాబు

1354చూసినవారు
తాడికొండలో ఉత్తర వీధిలోని రామాలయంలో వైసీపీ తాడికొండ నియోజక వర్గ ఇన్చార్జ్, సమన్వయ కర్త వనమా డైమండ్ వజ్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశంలోనే పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలకు వైసిపి ప్రభుత్వం కడిగిన ముత్యంలా బయటకు వచ్చిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించే ముందు నిజం తెలుసుకుంటే మంచిదని, ఆ భగవంతుడు వారికి మంచి బుద్ధిని, నడవడికను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్