ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లూరు గ్రామం వెనుక భాగంలో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో, మంగళవారం సాయంత్రం సుమారు 6 గంటలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. ఎస్‌బీ సీఐ–1 ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ నేతృత్వంలో ఎస్‌టీఎఫ్ సిబ్బంది ఈ దాడి చేసి, అక్రమ పేకాట స్థావరాన్ని ఛేదించారు.