పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యమని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పల్లపాటి లింగరాజు యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలో మొబైల్ టీం వాహనం ద్వారా నుదురుపాడు మెడికల్ ఆఫీసర్ సబిర బేగం గారి ఆధ్వర్యంలో పోలియో వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టారు. ప్రతి చిన్నారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకి పోలియో చుక్కలు పూలబాట అని, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.