తుళ్లూరు: మంత్రిపై దాడి ఘటనలో మరో నిందితుడి అరెస్టు

1809చూసినవారు
తుళ్లూరు: మంత్రిపై దాడి ఘటనలో మరో నిందితుడి అరెస్టు
2023 మార్చిలో రాజధానిలో మూడు రాజధానుల శిబిరం నిర్వహించిన ప్రాంతంలో ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్పై వైకాపా నాయకులు దాడి చేశారు. ఈ ఘటనపై మొత్తం 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం 12వ నిందితుడైన తాళ్ళాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం జాన్ (29)ను తుళ్లూరు సి. ఐ కొంకా శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి అతడి గృహంలో అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్