తుళ్లూరు: మట్టి అక్రమ తరలింపుపై కేసు

501చూసినవారు
రాజధానిలో అనుమతులు లేకుండా నల్లమట్టిని తరలిస్తున్న లారీని తుళ్లూరు పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం గ్రామాల మధ్య అక్రమంగా నల్లమట్టి లోడ్ చేసుకుని వెళ్తున్న లారీని వెంకటపాలెం సమీపంలో విజయవాడ పశ్చిమ బైపాస్ వద్ద ఎస్.ఐ. మురళీధర్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్లూరు సీ.ఐ. కె. శ్రీనివాసరావు తెలిపారు.
Job Suitcase

Jobs near you