తుళ్లూరు: అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం

702చూసినవారు
తుళ్లూరు: అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం
ఏపీ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టును మంజూరు చేసింది. అమరావతిలో రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన డీపీఆర్ను కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం పంపారు. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ. 1,299.08 కోట్లతో, కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ. 1,234.91 కోట్లతో ప్రాజెక్టును ప్రభుత్వం రూపకల్పన చేసింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి.

సంబంధిత పోస్ట్