తుళ్లూరు: కందులు కొనుగోలు గడువు పొడగింపు

493చూసినవారు
తుళ్లూరు: కందులు కొనుగోలు గడువు పొడగింపు
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, కందుల (తూర్) కొనుగోలు గడువును మే 4వ తేదీ వరకు పొడిగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ధర మద్దతు పథకం (PSS) కింద కొనుగోళ్లు కొనసాగుతాయని, రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్