తుళ్లూరు: వర్షాకాలం నాటికి మౌలిక వసతులు కల్పన పూర్తి

401చూసినవారు
తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామంలో గ్రామసభల సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, 2017 చివరిలో అమరావతి నిర్మాణానికి 48,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాజధానిపై 'మూడు ముక్కలాట' ఆడిందని విమర్శించారు. రాజధాని నిర్మాణంతో పాటు 29 గ్రామాల్లో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తామని, వర్షాకాలం నాటికి అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి చేస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్