తుళ్లూరు: ఏడుగురు బాలలకు రూ. 5000 రాజధాని పింఛన్ మంజూరు

641చూసినవారు
తుళ్లూరు: ఏడుగురు బాలలకు రూ. 5000 రాజధాని పింఛన్ మంజూరు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బాలలకు పింఛన్లు మంజూరు చేసే అవకాశం లేకపోవడంతో, తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఏడు కుటుంబాలకు చెందిన ఏడుగురు చిన్నారులకు (కుటుంబానికి ఒక్కరు చొప్పున) నెలకు రూ. 5 వేల చొప్పున పింఛన్ మంజూరు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నెల 28న జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఆర్డీఏ అధికారులు ఈ సమస్యను నివేదించారు. ఈ మేరకు పింఛన్ మంజూరు చేసే అధికారాన్ని సీఆర్డీఏ కమిషనర్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పింఛన్లను గురువారం మంజూరు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్