తుళ్లూరు లైబ్రరీ సెంటర్ వద్ద బస్సులు ఆపడం లేదని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. టిడ్కో గృహాల వద్ద బస్సులు ఆగకపోవడం, ప్రశ్నిస్తే కండక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దీంతో విజయవాడ బస్సును అడ్డుకుని, ప్రయాణికులు సూచించిన చోట తప్పనిసరిగా బస్సులు ఆపాలని డిమాండ్ చేశారు.