
కొల్లిపర: విద్యుత్ లైన్ల మరమ్మతులు కారణంగా అంతరాయం
దావులూరులో విద్యుత్తు మరమ్మతు పనుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ ప్రదీప్ శుక్రవారం తెలిపారు. ఈ అంతరాయం దావులూరు, చెముడుబాడు పరిసర గ్రామాల్లో ఉంటుంది. విద్యుత్ వినియోగదారుల సహకారం కోరారు.







































