మాణికల రమణకు నిత్యావసర సరుకులు పంపిణీ: నాగరాజు ఆనందం

293చూసినవారు
మాణికల రమణకు నిత్యావసర సరుకులు పంపిణీ: నాగరాజు ఆనందం
తెనాలిలోని చినరావురులో నివాసం ఉంటున్న మాణికల రమణకు హ్యుమన్ రైట్స్ అసోసియేషన్ ఆఫ్ జస్టిస్ (HRAJ) ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా HRAJ జాతీయ నాయకులు పల్నాటి నాగరాజు మాట్లాడుతూ, నిరుపేదలకు అండగా నిలబడి వారి సమస్యలపై పోరాటాలు చేస్తామని, సామాన్యులకు, బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తామని తెలిపారు. HRAJ జాతీయ చైర్మన్ శ్రీ నందం నరసింహారావుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్