తెనాలి ఆర్టీసీ డిపోలో తాత్కాలిక డ్రైవర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, కనీసం ఏడాదిన్నర అనుభవం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉన్నవారు డిపో కార్యాలయంలో సంప్రదించాలి. వైద్య
పరీక్షలు, శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. 8 గంటల డ్యూటీకి రూ. 1,000, 16 గంటల డ్యూటీకి రూ. 1,600 వేతనం చెల్లిస్తారు.