రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి.. మృతుడి గుర్తింపు కోసం గాలింపు

3377చూసినవారు
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి.. మృతుడి గుర్తింపు కోసం గాలింపు
మోదుకూరు–నిడుబ్రోలు రైల్వే స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తున్నప్పుడు జారిపడి సుమారు 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెనాలి రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, అతన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్