తెనాలిలో నేడు మెగా జాబ్ మేళా.. యువతకు ఉద్యోగ అవకాశాలు

1740చూసినవారు
తెనాలిలో నేడు మెగా జాబ్ మేళా.. యువతకు ఉద్యోగ అవకాశాలు
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెనాలిలో ఈ నెల 30న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెనాలి నేషనల్ ఆర్ట్స్ సెంటర్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ డ్రైవ్ కొనసాగనుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ, యువకులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సజీవరావు సూచించారు. వివిధ ప్రముఖ సంస్థలు అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నందున అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్