కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో పొలాల్లో శనివారం పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 8 మందిలో నలుగురు పారిపోగా, మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. వారి వద్ద నుండి 7 వేల నగదు, ఒక ఆటో, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.