తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం, తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కృష్ణ, గుంటూరు ఉమ్మడి జిల్లాల శాసన మండల సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రమాణం చేయించారు.