గత నెల 27న తెనాలి రామలింగేశ్వరపేటలో హత్యకు గురైన శిరీష (26) కేసులో నిందితులైన భర్త సాయిబాబు, అతని మేనల్లుడు కృష్ణలను తెనాలి వన్ టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితులను తెనాలి న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా, న్యాయమూర్తి రిమాండ్ విధించి రేపల్లె సబ్ జైలుకు తరలించారు.