తెనాలి మండలం గుడివాడ గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రవేశ ఆర్చ్ నిర్మాణ పనులను ప్రారంభించి, గ్రామపంచాయతీ భవనం పై అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో అత్తోట దీప్తి, తహశీల్దార్ గోపాలకృష్ణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.