తెనాలి పురపాలక సంఘం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 25.75 కోట్ల ఆస్తిపన్ను వసూలు లక్ష్యంగా రూ. 22.05 కోట్లు వసూలు చేసి రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ కె. రామ అప్పలనాయుడు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు జప్తు లేకుండా, ఎలాంటి కానుకలు ప్రకటించకుండానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గడువులోపు పన్ను చెల్లించి సంపూర్ణ సహకారం అందించారని ఆయన పేర్కొన్నారు.