గుంటూరు జిల్లా తెనాలిలోని మున్షి మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ దయనీయ స్థితిలో ఉంది. వర్షాలకు ప్రాంగణంలో నీరు నిలిచిపోవడం, పరిసరాలు చెత్తతో నిండిపోవడంతో
విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో
విద్యార్థులు ఎలా పాఠశాలకు వస్తారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల దుస్థితి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తమవుతోంది.