ఎరుకలపూడి ఆలయంలో చోరీ: 85 కేజీల ఇత్తడి సామాగ్రి మాయం

406చూసినవారు
ఎరుకలపూడి ఆలయంలో చోరీ: 85 కేజీల ఇత్తడి సామాగ్రి మాయం
గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలోని శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శుక్రవారం చోరీ జరిగింది. సుమారు 85 కేజీల ఇత్తడి సామాగ్రి, రాగి, ఇత్తడి కలశం, చెంబు వంటి వస్తువులు అపహరణకు గురైనట్లు ఆలయ నిర్వాహకులు గుర్తించి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్