రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

1908చూసినవారు
రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
నిడుబ్రోలు–మోదుకూరు స్టేషన్‌ల మధ్య ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి పడి మృతి చెందాడు. పట్టాల వెంబడి మృతదేహం ఉందని సమాచారం అందడంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 35–40 ఏళ్ల వయసున్న మృతుడి కుడి చేతికి కడియం ఉందని, మృతదేహాన్ని వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. జీఆర్పీ ఎస్‌ఐ ఎల్‌. సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్