పదోన్నతి పొందిన ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

742చూసినవారు
పదోన్నతి పొందిన ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
వినుకొండలోని సాధన ట్యూషన్ సెంటర్ లో కురిచేడు మండల విద్యాశాఖ అధికారిగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు చిన కోటేశ్వరరావును ఆదివారం ఘనంగా సన్మానించారు. సాధన ట్యూషన్ సెంటర్ డైరెక్టర్, కౌన్సిలర్ ఎస్కే.ఎం బాష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రూల్లా పాల్గొన్నారు. కోటేశ్వరరావు నిజాయితీ, నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడని, ఆయన ఎం.ఈ.ఓ గా పదోన్నతి పొందడం గర్వకారణమని జఫ్రూల్లా అన్నారు. కురిచేడు మండల విద్యాభివృద్ధికి, పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్