వినుకొండలో లిఫ్ట్ అడిగిన యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయడంతో స్థానికులు స్పందించి, ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.