వినుకొండ మండల పరిధిలోని వెల్లటూరు రోడ్డులో ఆదివారం ఉదయం ఆటో, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పేర్లపాడుకు చెందిన ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడగా, వినుకొండ పట్టణానికి చెందిన మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.