విద్యుత్ షాక్‌తో ఆటో డ్రైవర్ దుర్మరణం

1934చూసినవారు
విద్యుత్ షాక్‌తో ఆటో డ్రైవర్ దుర్మరణం
వినుకొండ పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో విద్యుత్ షాక్ తగిలి ఆటో డ్రైవర్ మరియదాసు మృతిచెందాడు. బొల్లాపల్లి గ్రామానికి చెందిన ఆయన డ్రైవర్స్ కాలనీలో నివాసముంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్